News February 19, 2025
విజయవాడ జీజీహెచ్లో సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు

AP: విజయవాడ జీజీహెచ్లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులను పరామర్శించిన ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీబీ సిండ్రోమ్ కేసుల చికిత్సకు మెడిసిన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
ఆదిలాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు మండలాల్లోని 166 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 9, 2025
మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..

TG: దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఈ నెల 13న HYDలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆ రోజు 4PMకు ఆయన HYD చేరుకొని ఓ హోటల్లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లి సీఎం రేవంత్ టీంతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ ఉండనుంది. అనంతరం పరేడ్, మెస్సీకి సన్మానం నిర్వహించనున్నారు. దాదాపు 2గంటల పర్యటన తర్వాత మెస్సీ అదే రోజు తిరుగు పయనమవుతారు.
News December 9, 2025
గొర్రె, మేక పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.


