News October 25, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘సత్యం సుందరం’

కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ సినిమా OTTలోకి వచ్చింది. Netflix వేదికగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ’96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అరవింద్ స్వామి, కార్తీ బావ, బావమరిదిగా నటించారు. వారిద్దరి మధ్య వచ్చే కామెడీ, ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి.
Similar News
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.
News December 6, 2025
ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్పోర్టు కోరింది.
News December 6, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్చైన్ డెవలప్మెంట్లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.


