News September 30, 2024
‘సత్యం సుందరం’ చిత్రం అద్భుతం: నాగార్జున

తమిళ హీరో కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ సినిమాను అక్కినేని నాగార్జున వీక్షించారు. ‘ప్రియమైన కార్తీ.. నిన్న రాత్రే మీ సినిమా చూశా. మీరు, అరవింద్ చాలా బాగా చేశారు. సినిమా చూసినంత సేపు నవ్వుతూనే ఉన్నా. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను, మన సినిమా ఊపిరి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నా. ప్రేక్షకులు, విమర్శకులు సైతం మీ సినిమాను అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. టీమ్‌కు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 2, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
News November 2, 2025
ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది: మోదీ

అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం <<18179210>>విజయవంతం<<>> కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన అంతరిక్ష రంగం దేశ ప్రజల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని కొనియాడారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘మన సైంటిస్టుల ఘనత వల్ల అంతరిక్ష రంగం నూతన ఆవిష్కరణలకు, ప్రయోగాలకు పర్యాయపదంగా మారింది. వారి విజయాలు దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఎన్నో జీవితాలకు సాధికారత కల్పిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.
News November 2, 2025
రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.


