News September 3, 2025

సత్యమేవ జయతే: కవిత

image

TG: ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో ట్వీట్ చేశారు. ‘నిజం మాట్లాడినందుకు నాకు దక్కిన బహుమతి ఇదే అయితే.. తెలంగాణ ప్రజల కోసం వంద రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం. సత్యమేవ జయతే. జై తెలంగాణ’ అని రాసుకొచ్చారు. బీఆర్ఎస్‌ నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గానే ఆమె ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News September 3, 2025

2 వారాల్లో రూ.18కోట్లు చెల్లించండి: సుప్రీం కోర్టు

image

AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేశారంటూ గతంలో జేపీ వెంచర్స్‌కు NGT రూ.18 కోట్లు జరిమానా విధించింది. ఆ ఫైన్‌ను 2 వారాల్లో చెల్లించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో NGT జరిమానాపై గతంలో విధించిన స్టేను ఎత్తేసింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్‌ను SC స్వీకరించి విచారణ జరిపింది.

News September 3, 2025

ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ, జొమాటో

image

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో తమ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. ప్లాట్‌ఫామ్ ఫీజులను భారీగా పెంచాయి. స్విగ్గీ దీన్ని మూడు రెట్లు పెంచుతూ ఆర్డర్‌కు రూ.15 చేసింది. GSTతో కలిపి ఈ అమౌంట్‌ను వసూలు చేయనుంది. జొమాటో 20% పెంచుతూ రూ.12 చేసింది. దీనికి GST అదనం. స్విగ్గీ నిత్యం 20 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తుండగా, జొమాటో 23-25 లక్షల వరకు చేస్తోంది.

News September 3, 2025

ఇది సార్.. ధోనీ ‘బ్రాండ్’

image

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా క్రికెటర్ ధోనీ బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అత్యధిక బ్రాండ్లకు(43) అంబాసిడర్‌గా వ్యవహరించిన భారతీయ సెలబ్రిటీ ఆయనే అని TAM AdEx తెలిపింది. షారుఖ్(35), అమితాబ్(28), దీపికా(23) తర్వాతి స్థానాల్లో ఉన్నారని పేర్కొంది. కాగా TVయాడ్స్‌లో రోజులో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీల్లో షారుఖ్, ధోనీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారని వెల్లడించింది.