News March 23, 2025

ముంబై టీమ్‌లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

image

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్‌ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్‌లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.

Similar News

News December 8, 2025

మైసూరు పప్పు మాంసాహారమా?

image

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.

News December 8, 2025

ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

image

ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

News December 8, 2025

ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఏర్పడతాయంటే?

image

ఫైబ్రాయిడ్లు ఎందుకు ఏర్పడతాయన్న విషయంలో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, శరీరంలో జరిగే కొన్ని మార్పులు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత తలెత్తినప్పుడు ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయి. వంశపారంపర్యంగా కూడా ఫైబ్రాయిడ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పోషకాహార లోపం, చిన్న వయసులోనే రజస్వల అవడం, ఒత్తిడి దీనికి కారణాలంటున్నారు నిపుణులు.