News May 22, 2024

మోదీ పాత్రలో సత్యరాజ్.. నిజమేంటంటే?

image

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటుడు సత్యరాజ్ స్పందించారు. తానూ ఈ వార్త చూశానని, అయితే.. ఈ విషయంలో ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాజాగా ఓ తమిళ న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రజలు సోషల్ మీడియాలో కనిపించిన యాదృచ్ఛిక వార్తలను షేర్ చేస్తుంటారని ఆయన అన్నారు. బాహుబలిలో ‘కట్టప్ప’గా సత్యరాజ్ పాపులరైన విషయం తెలిసిందే.

Similar News

News December 28, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BEL<<>>) ఘజియాబాద్‌లో 90 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిప్లొమా అర్హతగల వారు డిసెంబర్ 30 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 21ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అప్రెంటిస్‌లకు నెలకు స్టైపెండ్ రూ.12,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in

News December 28, 2025

దుర్గగుడిలో పవర్ కట్.. ఏం జరిగిందంటే?

image

AP: నిన్న విజయవాడ దుర్గగుడిలో 3 గంటల పాటు పవర్ కట్‌ చేయడం సంచలనంగా మారింది. మూడేళ్లకు కలిపి రూ.4.5 కోట్ల బిల్లులు ఉన్నాయని విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. అయితే దుర్గామాత ఆలయ భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తును 2023 నుంచి విద్యుత్ శాఖకు ఇస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. నెట్ మీటరింగ్ జీరో అవుతుందని, బిల్లులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయితీపై CMO సీరియస్ అయింది.

News December 28, 2025

బంగ్లా ‘యాంటీ ఇండియా’ మంత్రం

image

బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ స్టూడెంట్ లీడర్ హాదీ హత్యను అక్కడి ఇస్లామిస్ట్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. నిరసనలతో దేశాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారత్‌, ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘భారత వ్యతిరేక’ ధోరణి అక్కడ బలమైన శక్తిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా ఈ భావోద్వేగాలను విస్మరించలేని పరిస్థితి.