News September 10, 2024
వాట్సాప్లో ‘వ్యూవన్స్’ పెట్టుకున్నా ఫొటోలు సేవ్

వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన ‘వ్యూవన్స్’ ఫీచర్లో లోపం ఉన్నట్లు ‘జెంగో X’ అనే రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది. ఆ ఆప్షన్ను పెట్టుకున్నప్పటికీ ఫొటోలు సేవ్ అవుతున్నాయని, స్క్రీన్ షాట్ కూడా తీసుకునే వీలుందని తెలిపింది. ఒక్కసారి చూశాక డిలీట్ అవుతుందనే కారణంతో ఇతరులు పంపే సందేశాలను(ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్, టెక్ట్స్ మెసేజ్) సేవ్ చేసుకోవడం వల్ల ప్రైవసీకి మరింత భంగం కలుగుతుందని పేర్కొంది.
Similar News
News December 9, 2025
వరల్డ్ టాప్ డిఫెన్స్ కంపెనీల జాబితాలో HAL

వరల్డ్ TOP-100 డిఫెన్స్ కంపెనీల జాబితాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో నిలిచింది. BEL 58, మజ్గాన్ డాక్ 91 ర్యాంకుల్లో నిలిచాయని SIPRI నివేదిక పేర్కొంది. ప్రపంచ ఉద్రిక్తతలతో 2024లో జాబితాలోని 77 కంపెనీల ఆదాయం పెరిగినట్లు తెలిపింది. కాగా ఇండియా ఆయుధ విక్రయాలు 8.2% పెరిగి $7.5B ఆదాయం సమకూరింది. ఆయుధ ఆదాయంలో 49% వాటా USదే. చైనా 13%, UK 7.7%, రష్యా 4.6% ఇండియా 1.1% వాటా కలిగి ఉన్నాయి.
News December 9, 2025
నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.
News December 9, 2025
ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

TG: దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రపంచస్థాయి నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘13,500 ఎకరాల్లో జీరో కార్బన్ సిటీగా దీన్ని రూపొందిస్తాం. ఇక్కడి సంస్థల ద్వారా 13L మందికి ఉద్యోగాలు వస్తాయి. 9 లక్షల జనాభాకు వీలుగా గృహ నిర్మాణం జరుగుతుంది. డేటా సెంటర్లకు 400 ఎకరాలిస్తాం’ అని వివరించారు. అద్భుత ఆర్కిటెక్చర్ అర్బన్ ఫారెస్టులు ఉంటాయన్నారు.


