News February 9, 2026
SAVE ‘RDT’

అనంతపురం జిల్లాలో పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం ఆర్డీటీకి FCRA పునరుద్ధరణ కాకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు జిల్లా ప్రజాప్రతినిధులు సమస్యను వివరించారు. అయినా అనుమతులు రాకపోవడంతో విద్య, వైద్య, క్రీడా రంగాల సేవలపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో లైసెన్స్ పునరుద్ధరణ కోరుతూ ప్రజా సంఘాలు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
Similar News
News February 9, 2026
NLG: మున్సిపల్ పోలింగ్.. రెండు రోజులు సెలవులు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
News February 9, 2026
తూప్రాన్: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకులు

తూప్రాన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు మంద మకరంద్ సందర్శించారు. ఓటర్లకు కల్పిస్తున్న ప్రాథమిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్ సౌకర్యం, క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
News February 9, 2026
మెదక్: మున్సిపల్ ఎన్నికల పక్రియ సాఫీగా జరగాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల పక్రియ సాఫీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్నికల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జరుగనున్న నాలుగు మున్సిపాలిటీ ఎన్నికలు సాఫీగా జరగాలన్నారు. ఏవైనా ఎన్నికల నిర్వహణ పనులు పూర్తి కాకపోతే రేపు ఉదయం 9 గంటల వరకు పూర్తి చేయాలన్నారు.


