News September 5, 2024
ఆ నలుగురినీ కాపాడి.. అనంత లోకాలకు చేరి..

AP: విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన యువకుడు చంద్రశేఖర్(32) అనంతలోకాలకు చేరాడు. ఇద్దరు సోదరులు, మరో ఇద్దరితో కలిసి అతను సింగ్ నగర్లోని డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. చంద్ర ఆ నలుగురిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు చేర్చాడు. తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు. తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అతని భార్య 8 నెలల గర్భిణి.
Similar News
News November 17, 2025
అలంపూర్: ఈనెల 19 నుంచి ప్రపంచ వారసత్వ వారోత్సవాలు

ఈనెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు అలంపూర్ సంగమేశ్వర సముదాయంలో నిర్వహిస్తున్నట్లు పురావస్తు శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. వారోత్సవాలకు సూపరింటెండెంట్ నిఖిల్ దాస్, జిల్లా కలెక్టర్ సంతోష్ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సంస్కృతి, సాంప్రదాయాలు చారిత్రక కట్టల గురించి విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
News November 17, 2025
WGL: మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,080

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి మొక్కజొన్న సోమవారం తరలివచ్చింది. అయితే, గతవారంతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. గతవారం మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,090 పలకగా.. ఈరోజు రూ.2,080కి చేరింది. అలాగే, దీపిక మిర్చికి రూ.18వేల ధర వచ్చింది. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి.
News November 17, 2025
పెద్దపల్లి: కారు ఢీకొని ఒకరు మృతి

పెద్దపల్లి పట్టణ పరిధి బంధంపల్లిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బంధంపల్లి వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో బైకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


