News August 4, 2024
ఆపదలో ఉన్న కుటుంబాన్ని కాపాడారు.. థాంక్యూ: రాహుల్ గాంధీ

వయనాడ్‌లో ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని <<13767143>>రక్షించిన<<>> కల్పెట్టా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. 8 గంటలు శ్రమించి ఆపదలో ఉన్న కుటుంబాన్ని రక్షించారని ట్వీట్ చేశారు. బాధితులకు సాయపడ్డ ఆర్మీ సిబ్బందికి, NDRF, SDRFకు ధన్యవాదాలు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది చూపుతున్న నిబద్ధత, చేస్తున్న నిస్వార్థ సేవ ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
తెలంగాణలో కొత్త పెన్షన్ చెల్లింపు విధానం..!

2026-2027 కొత్త ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లు చెల్లించడంలో TG GOVT E-PPO (ఎలక్ట్రిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్) అనే ఓ కొత్త విధానాన్ని 2 నెలల్లో ప్రవేశపెట్టనుంది. తద్వారా పెన్షన్‌దారులు ఆఫీస్‌కు వెళ్లకుండా తమ వివరాలను నేరుగా అప్‌డేట్ చేసుకోవడం, 12 నంబర్లతో ఉన్న ఒక కోడ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ పొందడం, మరణించిన వారి చెల్లింపులు తక్షణం నిలిపివేయడానికి సహాయపడుతుంది.
News April 3, 2026
కవిత తన పార్టీకి TRS పేరు పెడతారా?

TG: కొత్త పార్టీ పెట్టనున్న వేళ HYD ప్రెస్‌మీట్లో జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. TRS పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చన్నారు. తాము పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నామని తెలిపారు. దీంతో తన పార్టీకి TRS పేరు పెట్టనున్నారా? అనే చర్చ మొదలైంది. కానీ ఇప్పటికే కవిత పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
News April 3, 2026
చద్దాను సైలెంట్ చేయడానికి కారణాలివేనా?

రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తప్పించడానికి బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీ విషయాలపై ఆయన మౌనం వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ నిర్దోషి అని తేలాక జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. అలాగే పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్యసభలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆప్ వర్గాలు ఆరోపించాయి.


