News March 7, 2025

జన్ ఔషధీ కేంద్రాలతో రూ.30K కోట్లు ఆదా: నడ్డా

image

దేశ వ్యాప్తంగా ఉన్న 15వేల PM జన్ ఔషధీ కేంద్రాల వల్ల 10 లక్షల మంది ప్రజలు ఖరీదైన మందులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని కేంద్ర వైద్యశాఖ మంత్రి JP నడ్డా తెలిపారు. దీని వల్ల ప్రజలకు రూ.30వేల కోట్ల వరకు ఆదా అవుతోందన్నారు. 50-90% తక్కువ ధరలకే జన్ ఔషధీ కేంద్రాల్లో మందులు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఆయా కేంద్రాల్లో 2వేలకు పైగా మందులు, 300 వరకు సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Similar News

News December 24, 2025

రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ధ్వజం

image

TG: వాదనలో విఫలమై, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు వ్యక్తిగత దూషణలు మాత్రమే ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రేవంత్ రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తోందని తెలిపారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న ఆయనను ప్రజలు క్షమించరని, 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ ఫైర్ అయ్యారు.

News December 24, 2025

1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలు: తుమ్మల

image

TG: విపక్ష నేతల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల్లో రైతులు యూరియా ఎక్కువ కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రమంతా యాప్ అమలు చేస్తామన్నారు. CM ఆదేశాలతో రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా 1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.

News December 24, 2025

BLO, సూపర్వైజర్ల రెమ్యునరేషన్ భారీగా పెంపు

image

AP: BLO, సూపర్వైజర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. EC ఆదేశాల మేరకు వారి హానరేరియమ్ భారీగా పెంచుతూ GO ఇచ్చింది. యాన్యువల్ రెమ్యునరేషన్‌ను BLOలకు ₹6000 నుంచి ₹12000లకు పెంచింది. BLO సూపర్వైజర్లకు ₹12000 నుంచి ₹18000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్, సమ్మరీ రివిజన్లలో పాల్గొన్న వారికి అదనంగా మరో ₹2000 అందించనుంది. 2025 ఆగస్టు నుంచి ఇది అమలవుతుందని పేర్కొంది.