News November 16, 2024
జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూశా: సంజూ

SAపై నాలుగో T20లో సెంచరీ చేసిన అనంతరం సంజూ శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాట్లాడుతూ ‘శ్వాస వేగంగా తీసుకుంటున్నా. మాట్లాడటం కష్టంగా ఉంది. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్నా. ఎంతో కష్టపడి ఇంత వరకు వచ్చా. ఈ సిరీస్‌లో ఓ సెంచరీ తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యా. దీంతో ఎన్నో విషయాలు నా తలలో తిరిగాయి. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్, తిలక్ నాకు హెల్ప్ చేశారు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.
News January 21, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News January 21, 2026
‘2000s’ గ్యాంగ్.. క్రికెటర్ల సెల్ఫీ వైరల్

2000దశకంలో క్రికెట్ చూడటం మొదలుపెట్టిన వారికి పైఫొటోలో ఎవరో ఒకరు ఫేవరెట్ ప్లేయరై ఉంటారు. ఓపెనర్‌గా సెహ్వాగ్ బాదుడు, సిక్సర్ల వీరుడు యువరాజ్, ఫీల్డింగ్‌లో కైఫ్ దూకుడు, బౌలింగ్‌లో అగార్కర్, నెహ్రా సత్తా.. ఇలా అప్పట్లో వీరి ఆటకు క్రేజే వేరు. తాజాగా వీరంతా ఒకే దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగారు. లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడీ, స్పోర్ట్స్ ప్రజెంటర్ గౌరవ్ కపూర్ కూడా వీరితో ఉన్నారు.


