News May 26, 2024
సారీ చెప్పు.. లేదంటే దావా: జనసేన కార్పొరేటర్‌కు సీఎస్ హెచ్చరిక

AP: ఉత్తరాంధ్రలో రూ.2వేల కోట్ల విలువైన 800 ఎకరాల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్, ఆయన కుమారుడు కొట్టేసినట్లు విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి ఆరోపించారు. వీటిని సీఎస్ తీవ్రంగా ఖండించారు. తాను, కుమారుడు, బంధువులు ఎక్కడా భూములు కొనలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలను మూర్తి వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Similar News
News December 6, 2025
VZM: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తమిళనాడు రాష్ట్రంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకి చెందిన నలుగురు మృతి చెందారు. రామేశ్వరం వద్ద ఆగి ఉన్న కారును అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ ఢీకొట్టింది. మృతులు దత్తిరాజేరు, గజపతినగరం మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా శబరిమల నుంచి తిరగివస్తున్నారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


