News December 3, 2024
క్రికెట్‌కు గుడ్ బై చెప్పి బ్యాంకులో ఉద్యోగం

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత జట్టు మాజీ ప్లేయర్ సిద్ధార్థ్ కౌల్ కొత్త అవతారమెత్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా చేరినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఆఫీస్ టైమ్ అంటూ రాసుకొచ్చారు. గత నెల 28న ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. కౌల్ భారత జట్టు తరఫున ఆరు మ్యాచులు ఆడారు.
Similar News
News December 6, 2025
భారత్‌లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్‌లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్ VVERలను భారత్ నిర్వహిస్తోంది.
News December 6, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
News December 5, 2025
పవనన్నకు థాంక్స్: లోకేశ్

AP: చిలకలూరిపేట ZPHSలో నిర్వహించిన మెగా PTM 3.Oకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘హైస్కూలు లైబ్రరీకి పుస్తకాలు, ర్యాక్‌లు, 25 కంప్యూటర్లు అందిస్తామని ప్రకటించిన పవనన్నకు ధన్యవాదాలు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా మన విద్యావ్యవస్థను 2029 నాటికి దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు Dy.CM అందిస్తున్న సహకారం చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.


