News February 25, 2026

SBIలో 116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

image

SBI 116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(AVP, డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc/BE/BTech, BCA/MCA, M.Tech, MSc, CA, ICAI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

Similar News

News February 27, 2026

సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే పేరెంట్స్‌కు అలర్ట్

image

పిల్లలు సూసైడ్ లేదా సెల్ఫ్-హార్మ్ వంటి పదాలతో ఇన్‌స్టాలో సెర్చ్ చేస్తే.. వెంటనే పేరెంట్స్‌కు అలర్ట్ వెళ్లేలా కొత్త ఫీచర్‌ వచ్చింది. పేరెంట్స్ సూపర్విజన్ టూల్స్ వాడుతున్న వారికి ఈ నోటిఫికేషన్లు వాట్సాప్ లేదా SMS రూపంలో వెళ్తాయి. ప్రస్తుతం US, UK వంటి దేశాల్లో మొదలైన ఈ ఫీచర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. పిల్లలను కౌన్సెల్ చేసేలా నిపుణుల సలహాలనూ ఇన్‌స్టా అందిస్తుంది.

News February 27, 2026

పాక్-అఫ్గాన్ బార్డర్‌లో యుద్ధ వాతావరణం

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఇటీవల జరిపిన<<19206132>> వైమానిక దాడులకు<<>> ప్రతీకారంగా తాలిబన్లు భారీ ఆపరేషన్ మొదలెట్టారు. డురాండ్ లైన్ వెంట పాక్‌కు చెందిన 15 చెక్‌పోస్టులను అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 40 మంది పాక్ సైనికులు చనిపోయారని మరికొందరిని బంధించామని తెలిపింది. అటు పాక్ కూడా దీటుగా బదులిస్తున్నామని, పలువురు తాలిబన్లను చంపామని అంటోంది.

News February 27, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 27)

image

1931: స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ మరణం(ఫొటోలో)
1932: ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం
1932: కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణుడు వేగె నాగేశ్వరరావు జననం
1956: లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మావలంకర్ మరణం
1972: సినీ నటుడు శివాజీ రాజా పుట్టినరోజు
2002: సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం, 59 మంది VHP కరసేవకులు మృతి