News August 17, 2024
SBI రివార్డ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని: ఎస్పీ
ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఆధార్ అప్డేట్/SBI రివార్డ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ A.R దామోదర్ ప్రజలను కోరారు. మీ వాట్సప్ నంబర్‌కి Apk ఫైల్స్ పంపి, మీ ఫోన్ ని హ్యాక్ చేసి సైబర్ నేరస్తులు ప్రజల నుంచి కోట్లలో డబ్బుల్ని కాజేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండండి – మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు.
Similar News
News September 9, 2024
ప్రకాశం: మంత్రి ఆదేశాలు.. అధికారుల చర్యలు
కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో ఈ నెల 2న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైంది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామానికి చెందిన ఓ ఓ వ్యక్తి ఆదివారం అద్దంకి వెళ్లి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఫిర్యాదుచేశారు. స్పందించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
News September 9, 2024
మస్కట్‌లో మార్కాపురం మహిళకు ఇబ్బందులు
మార్కాపురానికి చెందిన షేక్ మక్బుల్ బీ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని HYDకు చెందిన ఓ ఏజెంట్‌ను ఆశ్రయించింది. మస్కట్‌లోని ఓ సేట్ ఇంట్లో పని ఉందని ఏజెంట్ గత నెల 25న పంపించారు. అక్కడికెళ్లాక పనిచూపించకుండా.. ఒక గదిలో బంధించి ఒక పూటే ఆహారం ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారు. పంపించాలని కోరితే రూ.1.50లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఓ సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది.
News September 9, 2024
సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం: దామచర్ల
వరద బాధితుల సహాయార్థం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో శిద్దా రాఘవరావు, ఆయన సోదరులు, గోరంట్ల రవికుమార్, సుధానగుంట నరసింహారావు, వెంకట రామయ్య మరియు నిడమానూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.