News January 13, 2026

SBI ఖాతాదారులకు అలర్ట్

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ATMల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్లు సంఖ్య (నెలకు 5) కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. ఇక బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్‌ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.

Similar News

News February 8, 2026

నిద్ర ఎక్కువైనా ప్రమాదమే!

image

* ఎక్కువ సమయం నిద్రపోతే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
* ఇన్సులిన్‌ను నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది.
* మహిళల్లో సంతానోత్పత్తి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
* కండరాలు, నరాలు సంకోచించి శారీరకంగా అలసిపోతారు.
* తలనొప్పి, వెన్నునొప్పి వస్తాయి. డిప్రెషన్‌కు గురవుతారు.
* అలసట, నీరసంగా అనిపించి జంక్‌ఫుడ్/అధిక కేలరీలున్న ఫుడ్ తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది.

News February 8, 2026

2030లో కూలిపోనున్న ISS!

image

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని NASA చెబుతోంది. 1998లో స్పేస్‌లోకి అడుగు పెట్టిన ISSని 2030లో పసిఫిక్ మహా సముద్రంలో కూల్చేయనున్నారు. ఈ బాధ్యతను ‘Space X’కు అప్పగించింది. భూభాగానికి వేల KM దూరంలోని ‘పాయింట్ నీమో’లో కూలుస్తారు. ఇయర్లీ మెయింటినెన్స్ పెరగడం, అనుకున్న దానికంటే ఎక్కువ కాలమే స్పేస్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News February 8, 2026

ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

image

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.