News November 26, 2025

SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

image

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్‌టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News November 28, 2025

మూవీ ముచ్చట్లు

image

* Netflixలో స్ట్రీమింగ్‌ అవుతున్న హీరో రవితేజ ‘మాస్ జాతర’
* రిలీజైన వారంలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ మూవీ
* నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
* బాక్సాఫీస్ వద్ద గుజరాతీ చిత్రం ‘లాలో కృష్ణా సదా సహాయతే’ రికార్డులు.. రూ.50 లక్షలతో నిర్మిస్తే 49 రోజుల్లో రూ.93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్

News November 28, 2025

పాత ఫొటోలకు కొత్త రూపం.. ట్రై చేయండి!

image

పాడైపోయిన, క్లారిటీ కోల్పోయిన చిన్ననాటి ఫొటోలను HD క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. ‘జెమినీ AI’ను ఉపయోగించి అస్పష్టంగా ఉన్న చిత్రాలను అప్‌లోడ్ చేసి, సరైన ప్రాంప్ట్‌తో డిజిటల్ SLR నాణ్యతకు మార్చవచ్చు. ఇది గీతలు, మసకబారడం వంటి లోపాలను సరిచేస్తూ, రూపురేఖలను చెక్కుచెదరకుండా ఉంచి, మీ జ్ఞాపకాలను సజీవంగా అందిస్తుంది. ఈ <>ప్రాంప్ట్<<>> వాడి మీరూ ట్రై చేయండి.

News November 28, 2025

పీసీఓఎస్ ఉందా? ఇలా చేయండి

image

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రధాన సమస్య బరువు. ఎంత కడుపు మాడ్చుకున్నా, వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్, ప్రొటీన్ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవకాడో, ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె, నట్స్‌.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు వ్యాయామాలు, తగినంత నిద్ర ఉండాలి.