News August 3, 2024
SBI కస్టమర్లూ.. జాగ్రత్త!
ఎస్బీఐ ఖాతాదారులకు రివార్డ్స్ పాయింట్స్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు అకౌంట్‌కు రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ APK ఫైల్ పంపిస్తున్నారు. ఇది ఫేక్ మెసేజ్ అని, ఎస్బీఐ ఇలాంటి APK ఫైల్స్‌ను వాట్సాప్/SMSలలో పంపదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించింది.
Similar News
News January 21, 2025
APSRTCకి కాసుల వర్షం
AP: సంక్రాంతి పండుగ భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న 3 రోజుల పాటు రోజుకు రూ.20కోట్లకు పైగా ఖజానాలో జమయ్యాయని తెలిపింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 9వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు వెల్లడించింది.
News January 21, 2025
ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జి.. బిల్ ఎంతంటే?
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. కాగా సైఫ్ ఆస్పత్రి పూర్తి బిల్లు రూ.40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ రూ.25 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సైఫ్ నుంచి ఆస్పత్రి యాజమాన్యం రోజుకు రూ.7 లక్షలకుపైగా వసూలు చేసినట్లు టాక్. మరోవైపు సైఫ్‌ను రక్షించిన ఆటోడ్రైవర్‌కు ఓ సంస్థ రూ.11 వేల రివార్డు ప్రకటించింది.
News January 21, 2025
32,438 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <