News November 5, 2024
SBI కస్టమర్లు జాగ్రత్త!

స్కామర్లు ఎస్బీఐ కస్టమర్లకు మోసపూరిత సందేశాలను పంపుతున్నారని PIB తెలిపింది. SBI రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని APK ఫైల్స్ పంపుతున్నారని పేర్కొంది. అలాంటి లింకులపై క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయొద్దని హెచ్చరించింది. ఇలాంటి మోసాలకు చాలా మంది బలైపోయారని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.
SHARE IT
Similar News
News October 25, 2025
ఆర్థరైటిస్ ఎలా నివారించాలి?

మహిళల్లో కీళ్ల నొప్పులను(ఆర్థరైటిస్) నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ బరువు, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. నడక, ఈత, సైక్లింగ్ వంటివి కండరాలను బలోపేతం చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్నట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాలు తీసుకోవాలి. అవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు అధికంగా తీసుకోవాలి.
News October 25, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి ₹1,25,620కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,150 ఎగిసి ₹1,15,150గా ఉంది. అటు KG వెండి ధర రూ.1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 25, 2025
డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఖాళీలను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీకి SCERT నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 నుంచి లీప్ యాప్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. వచ్చే నెల 5-8 వరకు రాత పరీక్షలు నిర్వహించి, 13న రిజల్ట్స్ వెల్లడిస్తామని తెలిపింది. అనంతరం త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని వెల్లడించింది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుందని స్పష్టం చేసింది.


