News May 12, 2024
ఇంజినీరింగ్ విద్యార్థులకు SBI గుడ్ న్యూస్

ఇంజినీరింగ్ విద్యార్థులకు SBI గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో చేపట్టనున్న 12 వేల నియామకాల్లో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పిస్తామని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణనిచ్చి నియమించుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నియామకాలను సంస్థ చేపట్టనుంది. క్యాంపస్ నియామకాలు తగ్గిన సమయంలో SBI ప్రకటన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరటనివ్వనుంది.
Similar News
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.
News October 27, 2025
గిరిజనులకు 89,845 దోమతెరలు: సత్యకుమార్

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.
News October 27, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు గంటల వ్యవధిలోని <<18115652>>మరోసారి<<>> తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


