News April 14, 2025
హోమ్‌లోన్ తీసుకున్న వారికి SBI గుడ్‌న్యూస్

హోమ్‌లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల ఆర్‌బీఐ రెపోరేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. దానిని అనుసరిస్తూ SBI వడ్డీ రేట్లను సవరించింది. ఇవి రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారితో పాటు ఇప్పటికే తీసుకున్న వారికీ ఈ రేట్లు వర్తిస్తాయి. కాగా HDFC, BOI బ్యాంకులు ఇంతకుముందే వడ్డీ రేట్లను తగ్గించాయి.
Similar News
News April 16, 2025
శ్రీదేవి బయోపిక్‌లో చేస్తారా?.. హీరోయిన్ రియాక్షన్ ఇదే

హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్‌లో చేస్తారా? అని యాంకర్ అడగ్గా.. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని గుర్తు చేశారు. ఇప్పటికే ఎల్లువచ్చి గోదారమ్మ(గద్దలకొండ గణేశ్) సాంగ్‌లో చేశానని చెప్పారు. హీరోయిన్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా సూర్యతో ఈ బ్యూటీ నటించిన ‘రెట్రో’ మూవీ మే 1న రిలీజ్ కానుంది.
News April 16, 2025
ISSF వరల్డ్ కప్‌లో మెరిసిన భారత మహిళా షూటర్లు

పెరూలో జరిగిన ISSF వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు బంగారం, వెండి పతకాలతో మెరిశారు. ఉమెన్స్ 10మీ. ఎయిర్ పిస్టల్ క్యాటగిరీలో 18 ఏళ్ల సురుచి గోల్డ్ మెడల్ సాధించగా, 2024 ఒలింపిక్స్‌లో డబుల్ మెడల్ విజేత మనూ భాకర్ వెండి పతకం కైవసం చేసుకున్నారు. ఒలింపిక్స్ పతకాల తర్వాత మనూకు ఇదే తొలి అంతర్జాతీయ స్థాయి మెడల్ కావడం విశేషం. తాజాగా వీరిద్దరి ఘనత పట్ల క్రీడారంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
News April 16, 2025
అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందేభారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేరొంది. దీనిపై ఇక వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్‌కు సరాసరి నడిచే వందేభారత్ రైలును ఈ నెల 19న మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను కశ్మీర్‌ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.