News February 6, 2025
SBI ఆదాయం ₹1.28L CR, లాభం ₹16K CR

డిసెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన SBI నికర లాభం రూ.16,791 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలోని రూ.9,164 కోట్లతో పోలిస్తే ఇది 84% పెరగడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.1,18,193 కోట్ల నుంచి రూ.1,28,467 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం రూ.1,06,734 కోట్ల నుంచి రూ.1,17,427 కోట్లకు ఎగిసింది. గ్రాస్ NPA 2.42 నుంచి 2.07, నెట్ NPA 0.64 నుంచి 0.53 శాతానికి తగ్గాయి.
Similar News
News September 18, 2025
2030 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి: భట్టి

TG: గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల రీ యూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2 వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం’ అని తెలిపారు.
News September 18, 2025
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 10 రోజుల వరకు సభ నిర్వహించే అవకాశముంది. పంచాయతీరాజ్ సవరణ, AP మోటార్ వెహికల్ ట్యాక్స్, SC వర్గీకరణ, మున్సిపల్ చట్టాల సవరణ వంటి 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. సూపర్-6 మొదలు సాగునీటి ప్రాజెక్టుల వరకు 20 అంశాలపై చర్చించేందుకు TDP ప్రతిపాదించొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకెళ్లాలని YCP నిర్ణయించుకున్నట్లు సమాచారం.
News September 18, 2025
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

AP: ఇవాళ ఉ.10 గం.కు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ కోటా విడుదల కానుంది. 20న ఉ.10 గం.ల వరకు లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20-22వ తేదీ మ.12 గంటల్లోపు డబ్బు చెల్లించిన వారికి లక్కీడిప్లో అంగప్రదక్షిణ టోకెన్లు జారీ చేస్తారు. 22న ఉ.10 గం.కు ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం టికెట్లు, 23న ఉ.11గం.కు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, 24న ఉ.10కి రూ.300 టికెట్లు, మ.3గం.కు రూమ్స్ కోటా విడుదల చేస్తారు.