News January 12, 2025
SBI SCO అడ్మిట్ కార్డులు విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ కోసం అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది. జనవరి 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు జనవరి 17 నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఇంటర్వ్యూలు మొదలవుతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 1497 ఉద్యోగాలను SBI భర్తీ చేస్తోంది. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <
Similar News
News January 12, 2026
నేటి ముఖ్యాంశాలు

✹ ఇండియా ధైర్యానికి సజీవ సాక్ష్యమే సోమనాథ్: మోదీ
✹ AP: రూ.1750 కోట్లతో NTR విగ్రహం: నారాయణ
✹ గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల
✹ TG: ధరణి లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్: పొంగులేటి
✹ సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు
✹ న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో భారత్ విజయం
News January 12, 2026
ఢిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ

WPL-2026: ఢిల్లీతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో గుజరాత్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 205 రన్స్ చేసింది. చివరి ఓవర్లో DC 7 పరుగులు చేయాల్సి ఉండగా సోఫీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. 18, 19వ ఓవర్లలో జెమీమా సేన 41 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇది గుజరాత్‌కు రెండో విజయం.
News January 12, 2026
దేశానికి మోదీనే రక్షణ గోడ: ముకేశ్ అంబానీ

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నా PM మోదీ వల్ల ఇండియా సురక్షితంగా ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఈ సవాళ్లు భారత ప్రజలను ఇబ్బందిపెట్టలేవని, ఎందుకంటే నరేంద్ర మోదీ అనే అజేయ రక్షణ గోడ ఉందని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు చూస్తున్న ఆశ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో గుజరాత్‌లో ₹7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.


