News July 15, 2024
లోన్లు తీసుకున్నవారికి SBI షాక్

బ్యాంకు లోన్లు తీసుకున్న/తీసుకునేవారికి ఎస్బీఐ షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇవాళ్టి నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో వెహికల్, హోమ్ లోన్స్ తీసుకున్నవారిపై భారం పడనుంది. ఒక రోజు MCLRకు 8.1%, నెలకు 8.35%, 3 నెలలకు 8.4%, 6 నెలలకు 8.75%, ఏడాదికి 8.85%, రెండేళ్లకు 8.95%, మూడేళ్లకు 9% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News December 6, 2025
ధనికులకు దండాలు.. పేదలకు దండనా?.. రైల్వే తీరుపై విమర్శలు

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక <<18483830>>రైళ్లను<<>>, 37 రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. ‘సామాన్యుల రద్దీతో జనరల్ బోగీలు నిండిపోయి ఇబ్బంది పడుతున్నా మా కోసం ఎప్పుడైనా అదనపు బోగీలు వేశారా? ధనవంతులకి ఒక న్యాయం, పేదవాడికి మరో న్యాయమా?’ అని మండిపడుతున్నారు. పండుగల సమయాల్లోనైనా బోగీలు పెంచాలంటున్నారు.
News December 6, 2025
ఆడపిల్ల పుడితే రూ.10,000.. పండుగకు రూ.20,000!

TG: పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. సిరిసిల్ల(D) ఆరేపల్లిలో ఓ అభ్యర్థి ఎవరికైనా ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు మెదక్(D) కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఏకంగా 15 హామీలను బాండ్ పేపర్పై రాసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో ఆడపిల్ల పుడితే ₹2వేలు, తీజ్ పండుగకు ₹20వేలు, అంత్యక్రియలకు ₹5వేలు వంటి హామీలున్నాయి.
News December 6, 2025
శభాష్.. తల్లికి పునర్జన్మనిచ్చాడు

AP: విద్యుత్ షాక్తో కొట్టుమిట్టాడుతున్న తల్లి ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడుకున్నాడో ఐదో తరగతి బాలుడు. ఈ ఘటన ప.గో(D) జొన్నలగరువులో జరిగింది. నిన్న మెగా PTMకు వస్తానన్న తల్లి ఎంతకీ రాకపోవడంతో కొడుకు దీక్షిత్ ఇంటికి వెళ్లగా ఆమె కరెంట్ షాక్తో విలవిల్లాడుతూ కనిపించింది. కొడుకు భయపడకుండా స్విచ్ ఆఫ్ చేసి, కరెంటు తీగను తీసేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో పిల్లాడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.


