News February 4, 2025

నాలుగు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ!

image

TG: ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4 కేటగిరీలుగా విభజించాలని ప్రతిపాదించింది. మొదటి కేటగిరిలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, రెండో కేటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలుగా విభజించాలని సూచించింది.

Similar News

News December 7, 2025

రెండేళ్ల పాలనలో చేసింది మోసమే: కిషన్ రెడ్డి

image

TG: హామీలు అమలు చేయకుండా రేవంత్ ఉత్సవాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ‘CM చెప్పేది ఫ్రీ బస్సు, సన్నబియ్యం గురించే. KG బియ్యంలో కేంద్రం ₹43 భరిస్తోంది. పోలీసుల్ని పెట్టుకొని గ్రామాల్లో తిరగడం కాదు. హామీలపై చర్చకు రండి’ అని సవాల్ విసిరారు. రెండేళ్ల పాలనలో అందర్నీ మోసగించారని విమర్శించారు. మహాధర్నాలో నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ఛార్జిషీట్ విడుదల చేశారు.

News December 7, 2025

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్

image

భారీగా విమాన సర్వీసుల రద్దు, వాయిదాలతో ప్రయాణికుల ఖాతాల్లోకి ఇండిగో డబ్బులు రీఫండ్ చేస్తోంది. ఇప్పటివరకు రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు 95శాతం సర్వీసులను రీస్టోర్ చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10-15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుతాయని పేర్కొంది.

News December 7, 2025

రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

image

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్‌లైన్‌లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.