News February 4, 2025
ఎస్సీ వర్గీకరణ: మాదిగలు 32 లక్షలు, మాలలు 15 లక్షలు
TG: ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. మాదిగ జనాభా 32,33,642గా పేర్కొని, రెండో గ్రూపులో చేర్చారు. మాదిగతో పాటు చమర్, ముచి, చిందోల్లు, బైండ్ల తదితర కులాలు ఈ గ్రూపులో ఉన్నాయి. మాలల జనాభా 15,27,143గా ఉందని చెబుతూ వారిని గ్రూప్-3లో చేర్చారు. గ్రూప్-1లో బుడ్గ జంగం, మన్నే, మాంగ్ కులాలు ఉన్నాయి. గ్రూప్-1కు 1, గ్రూప్-2కు 9, గ్రూప్-3కి 5% రిజర్వేషన్లను సిఫారసు చేశారు.
Similar News
News February 4, 2025
రేపే పోలింగ్.. అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు
రేపు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. యమునా నదిని హరియాణా విషపూరితంగా మారుస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మనోభావాలు దెబ్బతీశారని, ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని FIRలో పేర్కొన్నారు.
News February 4, 2025
అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు.. కానీ: రొనాల్డో
రొనాల్డో – మెస్సీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు అని ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అన్నారు. ‘కానీ సాకర్ చరిత్రలో ఇప్పటివరకూ నా లాంటి ప్లేయర్‌ని చూసుండరు. నేనే కంప్లీట్, బెస్ట్ ప్లేయర్‌ని’ అని తెలిపారు. మెస్సీకి తనకు మంచి స్నేహం ఉందన్నారు. స్పానిష్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో రొనాల్డో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
News February 4, 2025
AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయండి: లోకేశ్
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఢిల్లీలో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో రాష్ట్రంలో తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు. ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయాలని కోరారు. AI అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని లోకేశ్ కోరారు.