News August 3, 2024

ఎస్సీ వర్గీకరణను AP వెంటనే అమలుచేయాలి: MRPS

image

AP: SC వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్‌లో వెంటనే అమలుచేయాలని MRPS రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బ్యాక్‌లాగ్ పోస్టుల్ని భర్తీ చేయాలని ఆయన కోరారు. 15శాతం ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ అనుబంధ ఉపకులాలకు 7శాతం, మాల అనుబంధ ఉపకులాలకు 6శాతం, రెల్లి వర్గాలకు 1శాతం, ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, ఇతర అనుబంధ కులాలకు 1శాతం ఇచ్చేలా వర్గీకరణ అమలుచేయాలని కోరారు.

Similar News

News November 28, 2025

నేడు అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్

image

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా, మూవీ టీం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇవాళ HYDలోని కూకట్‌పల్లిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘అఖండ’ చిత్రం ఉత్తరాదిలోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై హిందీ రాష్ట్రాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

News November 28, 2025

కాశీకి వెళ్లలేకపోయినా.. ఈ శివాలయాలకు వెళ్లవచ్చు

image

మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా కాశీ వెళ్లి తీరాలని మన శాస్త్రాలు చెబుతాయి. అయితే కాశీ వెళ్లడం సాధ్యం కానప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పండితులు అంటున్నారు. కాశీతో సమానమైన శక్తి ఉన్న 4 కాశీ క్షేత్రాలు ఉన్నాయంటున్నారు. వీటిలో ఏ క్షేత్రాన్ని దర్శించినా కాశీ యాత్ర ఫలం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 1. కేదార క్షేత్రం 2. శ్రీశైలం 3. శ్రీకాళహస్తి 4. పట్టిసము (పట్టిసీమ).

News November 28, 2025

నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.