News April 14, 2025

తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు

image

TG: 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని CM రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు, సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉత్తమ్ తెలిపారు.

Similar News

News December 1, 2025

పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

image

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 1, 2025

వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

image

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.