News January 6, 2026
SC, STలకు ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: గొట్టిపాటి

AP: సోలార్ రూఫ్ టాప్ పథకానికి టెండర్లు పూర్తి చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ‘సోలార్ రూఫ్ టాప్‌కి రూ.78వేల వరకు రాయితీ ఉంటుంది. BCలకు అదనంగా మరో రూ.20వేలు, SC, STలకు ఫ్రీగా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం కొన్ని రాష్ట్రాల ఇంధనశాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి విద్యుత్ రంగ ప్రైవేటీకరణ అంశంపై చర్చ నిర్వహించింది. దీనికి కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం’ అని తెలిపారు.
Similar News
News February 20, 2026
హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీపై వైసీపీ ఆరోపణలేంటి?

AP: ‘హెరిటేజ్’కు పుణే(MH)లోని ఇందాపూర్ డెయిరీ అనుబంధ సంస్థ అని YCP ఆరోపిస్తోంది. 2015లో అది TTDకి నెయ్యి సరఫరా చేసిందని, నాణ్యత లేకపోవడంతో అనర్హత వేటు వేశారని <<19186015>>జగన్<<>> చెబుతున్నారు. అప్పుడే కల్తీ జరిగితే తమపై ఆరోపణలేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఇందాపూర్’ తమ అనుబంధ సంస్థ కాదని, అక్కడి నుంచి చీజ్ మాత్రమే కొంటామని హెరిటేజ్ స్పష్టం చేసింది. తాము అసలు TTDకి నెయ్యి సరఫరా చేయలేమని పేర్కొంది.
News February 20, 2026
నత్తల నివారణకు విషపు ఎరను ఎలా తయారు చేయాలి?

ఈ నత్తలను విషపు ఎరను కూడా వాడి నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి 25 కిలోల తవుడు, 3 కిలోల బెల్లం, థయోడికార్బ్ 100 గ్రాములు, ఆముదం నూనె 100ML కలిపి చిన్న ఉండలుగా చేసి పొలాల్లో అక్కడక్కడా వేయాలి. వీటిని తిన్న నత్తలు మరణిస్తాయి. అంతేకాకుండా 1.5 లీటర్ల నీటిలో పొగాకు కాడెలను (50 గ్రా.) ఉడకబెట్టి చివరగా 60 గ్రా. కాపర్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసి నత్తలను నిర్మూలించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News February 20, 2026
ఉదయం పూట ఖర్జూరాలు తింటే..

ఉదయం లేవగానే ఖర్జూరాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది. గర్భిణులు, పిల్లలకు రెగ్యులర్‌గా ఇవ్వాలని, రాత్రిపూట నీళ్లు లేదా పాలలో నానబెట్టి ఉదయం తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.


