News October 26, 2024

SC, ST అభ్యర్థుల ఉచిత డీఎస్సీ శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు

image

విజయనగరం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు DSC ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబరు 27 వరకు పొడిగించినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.రామానంద శుక్రవారం తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను నేరుగా జ్ఞానభూమి పోర్టల్‌లో సమర్పించవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Similar News

News December 6, 2025

VZM: వెనుకబడ్డ మండలాలపై కలెక్టర్ అసహనం

image

100 రోజుల పనిదినాల కల్పనలో వెనుకబడిన మండలాలపై కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కల్పనపై శుక్రవారం వీసీ నిర్వహించారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస, తదితర మండలాలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రగతి చూపని మండలాల్లో పనులను వెంటనే వేగవంతం చేయాలని, వేతనం రూ.300కి తగ్గకుండా పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీఓ, ఏపీఓలకు సూచించారు.

News December 5, 2025

1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు: కలెక్టర్

image

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలని, నీటి సదుపాయం లేని చోట రుణాల ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేసి సాగు పెంచాలని ఆదేశించారు.

News December 5, 2025

VZM: కోర్టు కాంప్లెక్సుల్లో వాష్‌రూమ్‌ల నిర్వహణకు టెండర్లు

image

జిల్లాలోని వివిధ కోర్టు కాంప్లెక్సుల్లో 178 వాష్‌ రూమ్‌ల వార్షిక శుభ్రత నిర్వహణకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత శుక్రవారం తెలిపారు. 18 మంది క్లీనింగ్ సిబ్బందితో ఈ కాంట్రాక్ట్ ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన వారు తమ కొటేషన్లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, విజయనగరానికి సమర్పించాలని కోరారు.