News August 24, 2024
ఎస్సీ, ఎస్టీ చట్టం వాటికి వర్తించదు: సుప్రీంకోర్టు

SC, ST సామాజిక వర్గాల ప్రజల్ని కులం పేరు ఎత్తకుండా బెదిరించిన, అవమానించిన నేరానికి SC, ST వేధింపుల నిరోధక చట్టం-1989 కింద కేసు పెట్టలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కులంపేరుతో అవమానించినప్పుడు, వేధించినప్పుడు మాత్రమే చట్టంలోని సెక్షన్ 3(1)R వర్తిస్తుందని తేల్చింది. అంటరానితనాన్ని పాటిస్తే తప్ప అవమానాలు, బెదిరింపులకు చట్టం వర్తించదని కేరళ MLA vs యూట్యూబర్ కేసులో పేర్కొంది.
Similar News
News November 13, 2025
IRCTCలో 46 ఉద్యోగాలు

<
News November 13, 2025
మెన్స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

ఒక మెన్స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్ స్కిప్పింగ్ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.
News November 13, 2025
కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.


