News February 1, 2025
బహిరంగంగా దూషణ జరిగితేనే SC, ST కేసు: సుప్రీంకోర్టు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేర నిరూపణ జరగాలంటే బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించి నాలుగు గోడల మధ్య జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కోర్టు విచారించింది. అందరూ చూస్తుండగా ఘటన జరగలేదంటూ కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 3(1)(ఎస్) నిరూపితం కావాలంటే ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కులం పేరుతో బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.
Similar News
News February 1, 2025
‘స్వచ్ఛంద మరణం’ హక్కును అమలు చేయనున్న కర్ణాటక
కారుణ్య మరణాలపై SC ఆదేశాల అమలుకు KA సిద్ధమైంది. ఎప్పటికీ నయమవ్వని, బాధను భరించలేక, నరకం అనుభవిస్తూ లైఫ్ సపోర్టుతో ఆస్పత్రిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న వారికి గౌరవంగా మరణించే హక్కును అమలు చేయనుంది. మొదట ముగ్గురు డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షిస్తారు. తర్వాత Govt నియమించిన డాక్టర్, మరో ముగ్గురు డాక్టర్ల బృందం సమీక్షించి రిపోర్టును కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే ఇంజెక్షన్లు ఇస్తారు.
News February 1, 2025
నెట్ఫ్లిక్స్లో టాప్ ట్రెండింగ్లో ‘పుష్ప 2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నెట్ఫ్లిక్స్లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. టాప్-10 మూవీస్లో ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీ గత నెల 30న ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. కాగా ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ.1,900 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
News February 1, 2025
Stock Markets: రైల్వే, డిఫెన్స్ షేర్లపై ఫోకస్
దేశీయ స్టాక్మార్కెట్లు నేడు నష్టాల్లో మొదలై రేంజుబౌండ్లో కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్నిఫ్టీ 97 పాయింట్ల మేర నష్టపోవడం దీనినే సూచిస్తోంది. బడ్జెట్ మొదలయ్యాక సెంటిమెంటును బట్టి ఎటువైపైనా స్వింగ్ అవ్వొచ్చు. వృద్ధి, వినియోగం, ఇన్ఫ్రా, SMEలపై ఫోకస్ నేపథ్యంలో రైల్వే, డిఫెన్స్, బ్యాంక్స్, PSE షేర్లపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్ కావడంతో శనివారమైనా స్టాక్మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.