News April 1, 2025

కాకాణి గోవర్ధన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

image

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై SC, ST కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించినట్లు నెల్లూరు (D) పొదలకూరులో PSలో కేసు నమోదు చేశారు. అటు మైనింగ్ కేసులో ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వగా.. ఆయన గైర్హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరు, హైదరాబాద్‌లో కాకాణి అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది.

Similar News

News December 1, 2025

HYD: ‘ఓన్లీ ప్రాఫిట్‌ నో లాస్’ పేరుతో రూ.1.87కోట్ల మోసం

image

స్టాక్‌ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్‌ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్‌ తెలిపింది.

News December 1, 2025

డ్రామాపైనే మోదీ దృష్టి: ఖర్గే

image

ముఖ్యమైన అంశాలపై చర్చించడం కంటే డ్రామాపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చించకుండా 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని విమర్శించారు. సాగు చట్టాలు, జీఎస్టీ సవరణలు, సీఏఏపై తగిన చర్చ లేకుండా పార్లమెంటును బుల్డోజ్ చేసిందన్నారు.

News December 1, 2025

దిత్వా ఎఫెక్ట్.. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్

image

తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దిత్వా తుఫాన్ రావడంతో.. వరి పండిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫానుకు తమ పంట ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా మంది రైతులు వరి కోత సమయం రాకముందే కోసేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కోత యంత్రాల యజమానులు.. ఎకరా పంట కోయడానికి రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.