News August 14, 2025
SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్

TG: బిహార్‌లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు <<17403517>>తీర్పు<<>> ప్రజాస్వామ్య విజయమని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. LoP రాహుల్ లేవనెత్తిన ఓటు చోరీ ఆరోపణ ఈ తీర్పుతో రుజువైందన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఆధార్ లింక్‌తో ‘ఒక ఓటు-ఒక మనిషి’ విధానం అమలు చేయాలన్న రాహుల్ డిమాండ్‌పై EC స్పందించాలని డిమాండ్ చేశారు.
Similar News
News August 15, 2025
శనివారం వరకు వేటకు వెళ్లరాదు: APSDMA

AP: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అటు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వివరించింది.
News August 15, 2025
పులివెందులలో వైసీపీకి 8% ఓట్లా?: రోజా

AP: గత ఎన్నికల్లో పులివెందుల పరిధిలో YCP 64% ఓట్లు సాధించిందని, ఇప్పుడు 8.95% ఓట్లు రావడమేంటని ఆ పార్టీ నేత రోజా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 24% ఓట్లు వచ్చిన TDPకి ఇప్పుడు 88% ఓట్లు రావడమేంటని మండిపడ్డారు. ‘ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం ఏమిటో? పోటీలో ఉన్న అభ్యర్థికి వారి కుటుంబసభ్యులు అయినా ఓటు వేయరా? ఈ ఫలితాలను మనం నమ్మాలా?’ అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.
News August 15, 2025
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భద్రాద్రి, జనగామ, ఖమ్మం, మెదక్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంది.