News August 28, 2024

CJIని కూడా వదలని స్కామర్లు!

image

ఇన్‌స్టాలో మనకు తెలిసిన వారి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్‌ చేసి డబ్బు కోసం మెసేజ్లు పంపడం చూస్తుంటాం. అయితే ఓ స్కామర్ ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేరుతోనే డబ్బు అడిగాడు. ‘కొలీజియం మీటింగ్‌కు వెళ్లాలి. క్యాబ్ డ్రైవర్‌కు రూ.500 ఇవ్వాలి పంపిస్తారా? నేను కోర్టుకు వెళ్లగానే రిటర్న్ చేస్తా’ అని ఆ మెసేజ్ ఉంది. విషయం తెలుసుకున్న సుప్రీం కోర్టు కేసు పెట్టింది.

Similar News

News January 19, 2026

సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని<> ICAR<<>>-సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌లో 3 పోస్టులకు ఇవాళ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి PhD(అగ్రోనమీ/సాయిల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్), పీజీ అగ్రోనమీ/సాయిల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. RAకు గరిష్ఠ వయసు 40(M) కాగా, మహిళలకు 45ఏళ్లు. కంప్యూటర్ ఆపరేటర్‌కు 27ఏళ్లు. వెబ్‌సైట్: www.icar-crida.res.in

News January 19, 2026

వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

image

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

News January 19, 2026

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేయనున్న TTD

image

AP: ఏప్రిల్ కోటా తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన)ను 10AMకు TTD విడుదల చేయ‌నుంది. 21వ తేదీ ఉ.10గం.ల వరకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్‌కు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న మ.12 గంటల్లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న అకామిడేషన్(రూమ్స్), రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.