News May 21, 2024
అతడి ప్రవర్తనతో భయమేసింది: కాజల్

ఒక్కోసారి ఫ్యాన్స్ చూపించే మితిమీరిన అభిమానం హీరోయిన్స్‌ను టెన్షన్ పెడుతుంటుంది. కాజల్ అగర్వాల్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురైందట. ‘ఓ సినిమా షూటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ నా వ్యాన్‌లోకి వచ్చాడు. చొక్కా విప్పి తన ఛాతీపై టాటూ వేయించుకున్న నా పేరును చూపించాడు. అభిమానానికి ఆనందమే కానీ అతడి ప్రవర్తనకు చాలా భయమేసింది. ఇలా ఇంకెప్పుడు చేయొద్దని హెచ్చరించాను’ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.
Similar News
News November 24, 2025
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌పై సీఎం సమీక్ష

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్‌బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<


