News May 3, 2024

ఆ పాత్రలో నటించాలంటే భయమేసింది: రాశీ ఖన్నా

image

హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ఏంజెల్ ఆర్నగా నటించేందుకు తనకు భయమేసిందని చెప్పారు. ఆ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు తెలిపారు. నటిగా తనకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందని చెప్పారు. కాగా రాశీ ప్రధాన పాత్రలో నటించిన ‘బాక్’ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News November 19, 2025

MNCL: తీన్మార్ మల్లన్నతో ఉమ్మడి జిల్లా అధ్యక్షుల భేటీ

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో గురువారం ఇటీవల నూతనంగా నియమితులైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు భేటీ అయ్యారు. తమకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పాటుపడాలని సూచించారు.

News November 19, 2025

సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్‌లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.

News November 19, 2025

త్వరలో పంచాయతీ ఎన్నికలు.. ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్

image

TG: గ్రామ పంచాయతీల్లో ఓటరు సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. సెప్టెంబర్ 2న ప్రచురితమైన జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే రేపు(ఈ నెల 20) అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాటిపై DPO పరిశీలన చేస్తారని పేర్కొంది. ఈ నెల 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని వెల్లడించింది. త్వరలోనే GP ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.