News August 21, 2024

భయానకం.. చెట్టుపై శరీర భాగాలు

image

AP: అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొందరి అవయవాలు కంపెనీ ప్రాంగణంలోని చెట్లపై, గార్డెన్‌లో పడిన ఫొటోలు భయానకంగా ఉన్నాయి. ఏ పార్ట్ ఎవరిదని గుర్తుపట్టకుండా ఉంది. దీంతో మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Similar News

News July 10, 2025

EP-3: ఇలా చేస్తే వివాహ బంధం బలపడుతుంది: చాణక్య నీతి

image

వివాహ బంధం బలపడాలంటే దంపతులు ఎలా నడుచుకోవాలో చాణుక్యుడు వివరించారు. ఇద్దరూ కోపం తగ్గించుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. అన్ని విషయాలను చర్చించుకోవాలి. కష్టసుఖాలను పంచుకోవాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోకూడదు. మంచైనా/చెడైనా హేళన చేసుకోకూడదు. నేనే గొప్ప అనే అహం భావాన్ని పక్కన పెట్టి అన్ని పనుల్లో పరస్పరం సహకరించుకోవాలి.
<<-se>>#chanakyaneeti<<>>

News July 10, 2025

బుమ్రా, ఆర్చర్.. అంచనాలు అందుకుంటారా?

image

ఇవాళ భారత్- ఇంగ్లండ్ లార్డ్స్‌లో మూడో టెస్టులో తలపడనున్నాయి. అక్కడ పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే ఛాన్స్ ఉంది. అందుకే బుమ్రా, ఆర్చర్‌పై ప్లేయర్లే కాదు.. అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతున్నారు. వీళ్లు రాణిస్తే బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అయితే, ఎంత మేరకు అంచనాలు అందుకుంటారో చూడాలి.

News July 10, 2025

నేడు మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0

image

AP: ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనుంది. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.