News October 15, 2025
SCERT పాఠ్యపుస్తక రచనలో చిన్నమల్లారెడ్డి ఉపాధ్యాయుడు

కామారెడ్డి(M) చిన్నమల్లారెడ్డి ZPHSలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ TG SCERT 8వ తరగతి ప్రయోగ దీపిక పాఠ్యపుస్తక రచనలో పాల్గొన్నారు. ఇటీవల ఆయన చేసిన పాఠ్యపుస్తక రచన ప్రయోగ దీపిక తయారు కావడం, జిల్లా నుంచి ఏకైక ఉపాధ్యాయుడు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి, ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. విద్యార్థులకు ఉపయోగపడే రచనలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News October 15, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా లాభపడి 82,380 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 116 పాయింట్లు వృద్ధి చెంది 25,262 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, L&T, ఎటర్నల్, బెల్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.
News October 15, 2025
సిరిసిల్లలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు..15 వాహనాలు సీజ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రవాణా శాఖ అధికారులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేశారు. టాక్స్, ఫిట్నెస్, బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలపై చర్యలు తీసుకున్నారు. రేడియం స్టిక్కర్లు లేకుంటే ₹2000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగనున్నాయని తెలిపారు.
News October 15, 2025
అనుమతి లేని ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలోని ఆక్వా చెరువుల వివరాలను నిర్దేశించిన సమయంలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి మత్స్య శాఖాధికారులను మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. జిల్లాలో 26 వేల 582 ఆక్వా చెరువులు ఉన్నాయని, వాటికి సంబంధించి చెరువు విస్తీర్ణం, యజమాని పేరు, ఆక్వా సాగు, వినియోగిస్తున్న ఎరువులు, తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. అనుమతి లేని ఆక్వా సాగుపై చర్యలు తీసుకోవాలన్నారు.