News March 29, 2024

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

image

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు, 2-10 తరగతులకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కేవీ సంఘటన్ సూచించింది. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాలని పేర్కొంది. పూర్తి వివరాలకు కేవీ <>వెబ్‌సైట్<<>> చూడండి.

Similar News

News December 19, 2025

e-KYC లేకపోయినా బియ్యం పంపిణీ: పౌరసరఫరాల శాఖ

image

TG: రేషన్‌కార్డుదారులు ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. e-KYC తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపబోమని స్పష్టం చేశారు. కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు, ఐరిష్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.

News December 18, 2025

మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

image

ప్రధాని మోదీని ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్‌’తో ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA)పై చర్చలు జరిపారు. ప్రస్తుతం భారత్-ఒమన్ మధ్య 12 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతోంది.

News December 18, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) దర్యాప్తు చేయనుంది. సభ్యులుగా 9 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు <<18541312>>లొంగిపోయిన<<>> సంగతి తెలిసిందే.