News March 8, 2025

‘హౌస్ హోల్డ్’లో నమోదైతేనే పథకాలు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పథకాలు, ఇతర ప్రయోజనాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల హౌస్ హోల్డ్ జాబితా లేదా RTGSలో వివరాల నమోదును తప్పనిసరి చేసింది. ఆయా పథకాల అమలు, వినతుల పరిష్కార సమయంలో ఈ లిస్టులోని వివరాలు సరిపోల్చుకున్నాకే చర్యలు తీసుకుంటామంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 16, 2025

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ‘NO ఫ్యూయల్’

image

పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వెహికల్స్‌కు ఫ్యూయల్ నింపొద్దని పెట్రోల్ పంపులకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు గురువారం నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం దారుణంగా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ నడుపుతున్న వారికి SEPలో విధించిన చలాన్లలో 17% PUC సర్టిఫికెట్ లేనివి కాగా OCTలో 23%కి పెరిగాయి.

News December 16, 2025

వచ్చే నెలలో భోగాపురంలో ట్రయల్ రన్: రామ్మోహన్ నాయుడు

image

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును వచ్చే ఏడాది మే నాటికి ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో GMR-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఒప్పంద కార్యక్రమంలో లోకేశ్, రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రతి ఏటా ఏవియేషన్ రంగం 12% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని వివరించారు.

News December 16, 2025

నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

image

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.