News April 29, 2024

బాబుకి ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి: CM జగన్

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుకి ఓటేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లిలోని చోడవరంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2014లో చంద్రబాబుకి ఓటేస్తే అన్ని వర్గాలను మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని జగన్ ఆరోపించారు. భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. బాబు వస్తే వర్షాలు కూడా రావని అన్నారు.

Similar News

News January 30, 2026

రోజుకు లక్షన్నర బ్యారెల్స్.. రష్యా నుంచి ఇండియాకు!

image

రష్యా నుంచి పెద్దమొత్తంలో క్రూడాయిల్‌ను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఫిబ్రవరి నుంచి రోజూ సుమారు 1.5 లక్షల బ్యారెల్స్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటామని కంపెనీ చెప్పిందని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆంక్షల లిస్టులో లేని రష్యన్ కంపెనీల నుంచి రానున్న 2 నెలలు కొననుందని వెల్లడించింది. US ఆంక్షల నుంచి మినహాయింపు తీసుకుని డిసెంబర్‌లోనూ రష్యా క్రూడ్‌ను కొనిందని చెప్పింది.

News January 30, 2026

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో పోస్టులు

image

<>BRIC-<<>>నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును డిగ్రీ (లైఫ్ సైన్సెస్, BVSc, B.Pharma), పీజీ(లైఫ్ సైన్సెస్)అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 17వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు నెలకు రూ.48వేలు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.54,600 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.niab.org.in

News January 30, 2026

ఫిబ్రవరి 3న ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: వచ్చే నెల 3న క్యాబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో పాటు కీలక ఇష్యూలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 28న మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తుండడం విశేషం.