News January 5, 2025
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ గడువు పెంపు
TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ-పాస్ వెబ్సైటులో దరఖాస్తు చేసేందుకు గతంలో గడువు విధించగా, చాలా మంది అప్లై చేయలేదు. 7.44 లక్షల మంది రెన్యువల్ విద్యార్థుల్లో 4 లక్షల మంది, 4.83 లక్షల మంది కొత్త వారిలో కేవలం 1.39 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.
Similar News
News January 7, 2025
నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరోవైపు అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
News January 7, 2025
చైనా మాంజా అమ్మితే రూ.లక్ష వరకూ ఫైన్!
TG: సంక్రాంతికి గాలి పటాలు ఎగురవేసేందుకు కాటన్ దారాలను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 040-23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్లలో ఫిర్యాదు చేయాలన్నారు. చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, ₹లక్ష వరకూ ఫైన్, మనుషులు, పక్షులకు హాని జరిగితే 3-5 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా ఉంటుందన్నారు. NGT ఆదేశాలతో TGలో చైనా మాంజా వాడటాన్ని నిషేధించామన్నారు.
News January 7, 2025
తిరుమలలో పెరిగిన రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 16కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 54,180 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.20కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.