News March 27, 2025
స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు

TG: SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్‌కూ మే 31 వరకు గడువు ఇచ్చారు.
Similar News
News March 30, 2025
పేదలూ సన్న బియ్యం తినాలనేది మా ఆకాంక్ష: సీఎం

TG: దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని CM రేవంత్ వెల్లడించారు. HYDకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ శ్రీమంతుల మాదిరే పేదలూ సన్న బియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 1.56L మె.టన్నుల ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు.
News March 30, 2025
APPLY: నెలకు రూ.5,000.. రేపే చివరి తేదీ

యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన PM ఇంటర్న్‌షిప్ పథకం దరఖాస్తుకు రేపు చివరి తేదీ. దాదాపు 350 కంపెనీల్లో లక్షన్నర మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలను కేంద్రం కల్పించనుంది. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ(6 నెలలు క్లాస్‌రూమ్+6 నెలలు ఫీల్డ్ ట్రైనింగ్) ఉంటుంది. వన్ టైమ్ గ్రాంట్ కింద ₹6Kతోపాటు ప్రతినెలా ₹5K చొప్పున ఇవ్వనుంది.
వెబ్‌సైట్: https://pminternship.mca.gov.in/
News March 30, 2025
ఏప్రిల్ నుంచి ఉచితంగా రూ.5 లక్షల బీమా

TG: రాష్ట్రంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్థిక పరిమితులతో సంబంధం లేకుండా ఏప్రిల్ నుంచి ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ అమలు కానుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. ట్రీట్మెంట్, సర్జరీలు, మెడిసన్ ఖర్చులన్నీ కలిపి ఆ మొత్తానికి ఉచిత వైద్యం పొందొచ్చు. ఈ స్కీమ్ అమలుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు TGలోని 416 నెట్‌వర్క్ ఆస్పత్రులకు తాజాగా ఆదేశాలిచ్చారు.