News September 17, 2025

ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్.. APPLY

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <>ఆన్‌లైన్‌లో<<>> దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తారు. SHARE IT.

Similar News

News September 17, 2025

1-12 తరగతుల వరకు మార్పులు: CM

image

TG: విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమని CM రేవంత్ అన్నారు. నూతన విద్యా విధానం రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. ‘పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గం. 1-12 తరగతుల వరకు మార్పులు జరగాలి. ఎలాంటి నిర్ణయానికైనా నేను సిద్ధం. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలు పొందలేకపోవడానికి నాణ్యత, నైపుణ్యత కొరవడటమే కారణం. మేధావులు, విద్యాధికుల సూచనలతో కొత్త పాలసీ రూపొందించాలి’ అని ఆదేశించారు.

News September 17, 2025

ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా

image

టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. ఆటోమేటిక్ ఫైనల్ మార్క్ 84.50 మీ. కాగా ఆయన తొలి అటెంప్ట్‌లోనే జావెలిన్‌ను 84.85 మీ. విసిరారు. వెబెర్(జర్మనీ) 87.21 మీ., వెంగెర్(పోలెండ్) 85.67 మీ. విసిరి ఫైనల్లో అడుగుపెట్టారు. ఫైనల్ రేపు జరగనుంది. ఇక 2023లో బుడాపేస్ట్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ గోల్డ్ కొల్లగొట్టారు.

News September 17, 2025

ఓంకారం ఓ ఆరోగ్య సంజీవని

image

ఓంకారం కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. ఇది ఓ సంపూర్ణ ఆరోగ్య సంజీవని. నాభి నుంచి పలికే ఈ లయబద్ధమైన శబ్దం శరీరంలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుంది. దీని పఠనం రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తొలగించి, అపారమైన ప్రశాంతతను అందిస్తుంది. ఓంకారం మనసు, శరీరం, ఆత్మల ఏకీకరణకు ఓ శక్తిమంతమైన సాధనం.