News September 10, 2025

కార్మికుల పిల్లలకు రూ.25,000 వరకు స్కాలర్‌షిప్

image

కేంద్ర ప్రభుత్వం బీడీ, గనులు, సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు చదువును బట్టి రూ.25,000 వరకు ఏటా<> స్కాలర్ షిప్ <<>>అందిస్తోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుతున్న <<-se_10012>>విద్యార్థులు<<>> ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు అక్టోబర్ 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://scholarships.gov.in/

Similar News

News September 10, 2025

విజయవాడలో వే2న్యూస్ కాన్‌క్లేవ్

image

నవ్యాంధ్రప్రదేశ్‌ను రాబోయే పదేళ్లలో ఎలా చూడబోతున్నామో ప్రభుత్వం, ఇండస్ట్రీ నిపుణులు వివరించే వేదిక Way2News కాన్‌క్లేవ్. విజయవాడ CK కన్వెన్షన్‌లో ఈనెల 12న జరిగే తొలి డిజిటల్ మీడియా సదస్సులో CM చంద్రబాబు, విపక్ష నేతలు పాల్గొంటున్నారు. అటు గీతం విద్యాసంస్థల ఛైర్మన్, వైజాగ్ ఎంపీ భరత్, అమలాపురం ఎంపీ హరీశ్ బాలయోగి కూడా వేదికపై తమ ఆలోచనలు, రోడ్ మ్యాప్ పంచుకోబోతున్నారు.
Note: Entry By Invitation Only

News September 10, 2025

హీరోయిన్ నయనతారకు నోటీసులు

image

హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. <<14567761>>డాక్యుమెంటరీ<<>>లో చంద్రముఖి మూవీ క్లిప్స్‌ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు ‘నేను రౌడీనే’ క్లిప్ వాడటంపై ఆ మూవీ నిర్మాత ధనుష్ సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మూవీ క్లిప్‌లు వాడటంపై అక్టోబర్ 6లోపు సమాధానమివ్వాలని నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.

News September 10, 2025

మంచి నిద్ర కోసం చదవాల్సిన శ్లోకం

image

అగస్త్యో మాధవశ్చైవ
ముచకుందో మహామునిః
కపిలో మునిరాస్తీకః
పంచయతే సుఖశాయనః
ఈ ప్రసిద్ధమైన శ్లోకాన్ని పఠించి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని పండితులు చెబుతున్నారు. మంచి నిద్ర కోసం రుషులను తలచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వారి పేర్లు(అగస్త్య, మాధవ, ముచుకుంద, కపిల, ఆస్తీక) కలిపి ఈ శ్లోకాన్ని రాశారు.