News October 13, 2025

విద్యార్థినులకు తోడ్పాటునందించే స్కాలర్‌షిప్

image

దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసే విద్యార్థినులకు యూ-గో సంస్థ స్కాలర్‌షిప్ అందజేస్తోంది. 10th, Interలో 70% మార్కులు సాధించి ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, లా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు అర్హులు. సంవత్సరానికి 40వేలు అందిస్తారు. చివరి తేదీ అక్టోబరు 31. వెబ్‌సైట్: <>www.b4s.in/sen/RFS12<<>>

Similar News

News October 13, 2025

కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

image

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

News October 13, 2025

WOW: ఇది ఎక్కడో కాదు.. మన దగ్గరే

image

ఫొటో చూడగానే ఏ అమెరికానో, యూరప్ కంట్రీనో అని అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఇది మన హైదరాబాద్ నగరంలో తీసిన ఫొటోనే. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో తీసిన ఈ పిక్‌ను Xలో ఓ యూజర్ పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. ఎత్తైన భవనాలు, మధ్యలో బంగారు వర్ణం మబ్బులతో కనువిందు చేస్తోంది. మీకెలా అనిపించింది? COMMENT
credits: @beforeishutup

News October 13, 2025

నకిలీ మద్యంపై CBIతో విచారణ చేయించాలి: YCP

image

AP: CBNకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని YCP డిమాండ్‌ చేసింది. నేడు రాష్ట్రంలో ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు ఆ పార్టీ పేర్కొంది. తప్పు చేసిన వాళ్లే సిట్‌తో దర్యాప్తు చేయించడం హాస్యాస్పదమని విమర్శించింది. దోషులు ఎవరున్నా తక్షణమే అరెస్టు చేయాలని, కల్తీ సరకుతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలంది. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.