News August 8, 2025

స్కూళ్లకు సెలవులు

image

వరుస పండుగల నేపథ్యంలో నేటి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభమయ్యాయి. ఏపీలో నేడు వరలక్ష్మీ వ్రతం, రేపు రాఖీ పౌర్ణమి (రెండో శనివారం), ఆదివారం సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అటు తెలంగాణలో ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇవ్వడంతో పలు స్కూళ్లు హాలిడే ప్రకటించాయి. కొన్ని పాఠశాలలు సెలవు ప్రకటించలేదు. రేపు, ఎల్లుండి సెలవులు ఉండనున్నాయి. మరి మీ స్కూల్‌కు ఇవాళ హాలిడే ఇచ్చారా? కామెంట్ చేయండి.

Similar News

News August 8, 2025

సుంకాల నుంచి ఫార్మాకు మినహాయింపు.. ఎందుకంటే?

image

అమెరికాలో వాడే జనరిక్ మెడిసిన్లలో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. క్యాన్సర్, ఇతర ప్రమాదక వ్యాధులకు మన దేశ మందులనే వాడుతారు. అయితే ట్రంప్ సర్కార్ టారిఫ్స్ నుంచి ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చింది. మెడిసిన్ ధరలు భారీగా పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని భారత ఫార్మా కంపెనీలు USలోనే ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

News August 8, 2025

రేప్ కేసులో పాక్ క్రికెటర్ అరెస్టు.. బెయిల్‌పై విడుదల

image

రేప్ కేసులో పాకిస్థాన్-A క్రికెటర్ హైదర్ అలీని ఇంగ్లండ్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లండ్-Aతో వన్డేలు ఆడేందుకు UK వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం చేశాడని పాకిస్థాన్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. AUG 3న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అటు విచారణ పూర్తయ్యే వరకు అలీని సస్పెండ్ చేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.

News August 8, 2025

నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.