News April 25, 2024
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు మొదలుకానున్నాయి. జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభం అవుతాయి. సెలవుల్లో ప్రైవేటు స్కూళ్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కాగా సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ విద్యాశాఖ <<13091267>>‘సెలవుల్లో సరదాగా’<<>> కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Similar News
News March 27, 2026
ఇన్ఫెక్షన్లతో గుండెపోటు.. వైద్యుల సలహా ఇదే!

రక్తపరీక్షలు సాధారణంగా ఉన్నా, స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఇవి శరీరంలో వాపును పెంచి, రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. దీనివల్ల ధమనుల్లోని ప్లాక్ పగిలి ఆకస్మిక గుండెపోటుకు దారితీయొచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయకండి. నోటి పరిశుభ్రత పాటించండి. గుండె ఆరోగ్యం కోసం అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడమూ ముఖ్యమే’ అని సూచిస్తున్నారు.
News March 27, 2026
రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
News March 27, 2026
IPL జట్లకు ఆదాయం ఎలా వస్తుంది? ఏ టీమ్ ఎక్కువ సంపాదించింది?

IPLలోని 10 జట్లకు యాడ్స్, మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్స్, టికెట్ విక్రయాల ద్వారా ఆదాయం వస్తుంది. దేశ, విదేశాల్లో ఆడే టోర్నమెంట్స్ వల్ల ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. IPL, ILT20, మేజర్ క్రికెట్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడే KKR 2025లో అత్యధికంగా ₹756Cr సంపాదించింది. తర్వాతి స్థానాల్లో CSK(₹674Cr), MI(₹665Cr), SRH(₹642Cr), RR(₹635Cr), DC(₹603Cr), GT(₹559Cr), RCB(₹504Cr), PBKS(₹471Cr) ఉన్నాయి.


